తెలంగాణ

డీఐల కొరత..ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఔషధ నియంత్రణ శాఖలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల (డిఐ)ల కొరత ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలకు ఇబ్బందిగా పరిణమించింది. ప్రస్తుతం 12 డిఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం అనుమతి కోసం రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ విభాగం పంపిన ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 25 వేల మందుల దుకాణాలు, 468 ఔషద ఉత్పాదక యూనిట్లు పని చేస్తున్నాయి. ఈ శాఖకు అప్పగించిన విధులు చాలా ఎక్కువ. వీటిలో అతిముఖ్యమైనది ఉత్పాదకత, మందుల విక్రయ విభాగాలు. మందుల దుకాణాల్లో విక్రయించే ప్రతి మందు కూడా నాణ్యమైనదై ఉండి, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ విధులతో పాటు మరికొన్ని అనుమతులు, రెన్యూవల్స్ వంటివి కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇబ్బడి ముబ్టడిగా పెరిగిపోతున్న మందుల దుకాణాలన్నీ కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతున్నందున తనిఖీ అనేది చాలా అతిముఖ్యమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా మారింది. గతంలో 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఐలే ఇప్పుడూ ఉన్నారు. 31 జిల్లాలుగా ఏర్పడినా అదే స్థాయిలో భారంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం 71 పోస్టులకు గాను 59 మంది పని చేస్తుంటే, 12 ఖాళీలు ఉన్నాయి. విపణిలో ఉన్న కొన్ని మందుల్లో నాణ్యత లేనివి ఉన్నట్లు అప్పుడప్పుడు దాడులు చేసి గుర్తింస్తుంటారు. వీటిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి తయారై వచ్చే మందులే ఉంటున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికార వర్గాలు తెలిపాయి. స్థానికంగా ఎప్పుడైనా నాణ్యతలేనివి లభిస్తే అవి కేవలం 5 శాతం మాత్రమే ఉంటాయి. ఇప్పటికే నాణ్యత లేని మందులు 42 రకాలు ఉన్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని మందుల వల్ల వాటిని వినియోగించే రోగులు మరింత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. నాణ్యత లేని మందులు శాంపిళ్లు సేకరించిన అధికారులు డ్రగ్ కంట్రోల్ విభాగంలోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విభాగాన్ని కూడా పటిష్టపరుస్తున్నారు. ఇప్పటికి ఉన్న ల్యాబ్‌లో చాలా నాణ్యత నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నా, ఇంకా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇంజక్షన్లు వంటి కొన్నింటిని పరీక్షించేందుకు వీలు ఉంటుందని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతి మీనా తెలిపారు. రూ.28 కోట్ల వ్యయంతో డ్రగ్ కంట్రోల్ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన రూ.5 నుంచి 6 కోట్ల మొత్తాన్ని కేటాయించిందని, కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధులు రావాల్సి ఉందని వివరించారు. ఆధునీకరించిన ల్యాబ్ అందుబాటులోకి వస్తే నాణ్యత లేని మందులను అడ్డుకునేందుకు, వాటిని నిర్ధారించేందుకు మరింత వీలు కలుగుతుందని తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆమె స్పష్టం చేశారు.