తెలంగాణ

కౌలు రైతు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, జూన్ 17: వ్యవసాయానే్న జీవనోపాధిగా నమ్ముకొని పోరాటం చేస్తున్న రైతులకు వర్షాల కష్టాలు తప్పడం లేదు. ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ నేటికి పూర్తి స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు దుక్కులు దున్ని ఆకాశం వైపు చూస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మొలకెత్తిన విత్తనాలను ఎండవేడిమి నుండి చనిపోకుండా నీటిని పడుతున్నారు. చందుర్తి మండలం బండపెల్లి గ్రామానికి చెందిన న్యాత దినాకర్ అనే యువరైతు డిగ్రీ పూర్తి చేసి ఉపాధి లేకపోవడంతో గ్రామ శివారులో రెండెకరాల వ్యవసాయ భూమిని 20 వేలకు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేయగా తొలకరి జల్లులకు విత్తనాలు మొలవగా ఎండ వేడిమికి పసిమొగ్గలు ఎండిపోతుండగా ఇట్టి మొక్కలను కాపాడేందుకు యువరైతు వాటర్ ట్యాంకర్‌ను అద్దెకు తీసుకొని పైపు ద్వారా పత్తి మొక్కలకు నీళ్లు పెడుతున్న దృశ్యాన్ని ‘ఆంధ్రభూమి’ తన కెమెరాలో బంధించింది. ఇప్పటికైనా వర్షాలు కురిస్తేనే రైతుల పరిస్థితి ఆశాజనకంగా మారనుంది.
లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడనుంది. వేములవాడ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు వేసిన మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా వానదేవుడు కరుణించాలని రైతులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.