తెలంగాణ

కేసీఆర్‌కు పాలించే అర్హత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 24: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారని, బంగారు తెలంగాణ కేవలం ఆయనకు, కొడుకు, అల్లుడు, కూతురుకే పరిమితమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ జన చైతన్య యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ వస్తే గరిబోళ్ల రాజ్యం వస్తుందనుకుంటే మళ్లీ గడీల పాలన వచ్చిందన్నారు. ఈ గడీల పాలనకు తరిమికొట్టే సత్తా బీజేపీకే ఉందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పతనానికి, తెలంగాణలో బీజేపీ జైత్రయాత్రకు తమ జన చైతన్య యాత్ర నాంది పలుకనుందన్నారు.
దేశంలో నరేంద్రమోదీ పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతుండగా వాటి ప్రయోజనాలను తెలంగాణ ప్రజలకు అందకుండా సీఎం కేసీఆర్ కేంద్ర నిధులను పక్కదోవ పట్టిస్తూ ఆంధ్ర కాంట్రాక్టర్లు, టీఆర్‌ఎస్ నాయకుల జేబులు నింపుతున్నాడన్నారు. ప్రాజెక్టులను కమీషన్ల కాంట్రాక్టులుగా మార్చాడన్నారు. మోదీ పాలనలో దేశానికి ప్రపంచ స్థాయిలో గౌరవం పెరిగిందంటూ మోదీ పథకాలను లక్ష్మణ్ వరుసగా ఏకరువు పెట్టారు. కుంభకోణాల కాంగ్రెస్‌ను అన్ని రాష్ట్రాల్లో ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు అవినీతి కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారన్నారు. మహిళలకు మంత్రి వర్గంలో స్థానం లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మజ్లీస్ పార్టీ ఎజెండాను అమలుచేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోగా నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనలో ఇచ్చిన హామీలు అమలుకాకపోగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు ముందుకొచ్చిన బీజేపీకి అవకాశం ఇచ్చి సుపరిపాలన అందుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఉచిత బోర్లు, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర అందిస్తామన్నారు. కేంద్రం ఇప్పటిదాకా వివిధ పథకాల కింద జిల్లాకు ఇచ్చిన రూ.543 కోట్ల నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేసిందన్నారు. కేంద్రం నుండి నల్లగొండ అసెంబ్లీకి ఆయా పథకాల కింద ఇప్పటికే రూ.50కోట్లు ఇచ్చామన్నారు. కేంద్రం కేటాయించిన ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుచేయడం లేదని, నిధులిచ్చినా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని, ఎయిమ్స్ ఏర్పాటులో జాప్యం చేస్తోందని విమర్శించారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టుల కోసం టిఆర్‌ఎస్‌తో లాలూచీ పడుతున్నారన్నారు.
పోరుగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు నిజాంను తరిమినట్లుగానే ఫిరాయింపులను ప్రొత్సహిస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ పాలనను తరిమికొట్టాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కృష్ణదాసు, యాత్ర ఇన్‌చార్జి ముత్యాల ప్రదీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.

చిత్రాలు..నల్లగొండలో ఆదివారం బీజేపీ జనచైతన్య యాత్ర సభలో ప్రసంగిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్..
* హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు