తెలంగాణ

దొర పెత్తనం.. జాగీరు మారదా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 24: సంస్థానాలు, జాగీరుదారుల వ్యవస్థ కాలగర్భంలో కలిసిపోయి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఆ గ్రామ ప్రజలు మాత్రం ఇంకా దొరల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోం ది. పాలకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారి సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ ప్రక్షాళన కార్యక్రమం కూడా ఆ గ్రామ రైతులు కొట్టుమిట్టాడుతున్న సమస్య నుంచి గట్టెక్కించలేకపోయింది. నిజాం ప్రభుత్వంలో ప్రముఖ సంస్థానాల్లో పాపన్నపేట ఒకటి. ఈ సంస్థానాదీశుల కుటుంబానికి చెందిన సదాశివరెడ్డి 1930 సంవత్సరం కాలంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో వ్యవసాయ యోగ్యమైన ఓ ప్రాంతానికి పాపన్నపేటకు చెందిన కొన్ని కుటుంబాలను వెంటబెట్టుకు వచ్చి దౌలాపూర్ గ్రామాన్ని ఏర్పాటు చేసారు. సంస్థానాదీశుడితో పాటుగా వెంట సహాయకులుగా, కాపలాదారులుగా వచ్చిన కుటుంబాలకు సాగు భూమిని కేటాయించి స్థిర నివాసం ఏర్పాటు చేసారు. స్వాతంత్య్రం వచ్చాక సీలింగ్ యాక్ట్ అమలులోకి రావడంతో ఈ గ్రామ శివారులోని దాదాపు 1400 ఎకరాలు పరిష్కారం కోసం కోర్టులో దావా కొనసాగుతోంది. కాగా ఈ గ్రామానికి చెందిన కొంతమం ది రైతులకు సదాశివరెడ్డి కుమారుడు రాజా నరేందర్‌రెడ్డి సాదా బైనామాల కింద దాదాపు భూమలు రాసి ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1948లో కొంత మందికి 38 (ఈ) కింద సర్ట్ఫికెట్లు జారీ చేసినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేయించి రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ఎలాంటి పుస్తకాలు ఇవ్వలేదు. ఈనెల 11,12,13 తేదీల్లో మండల కేంద్రమైన పాపన్నపేటకు గ్రామస్థులు తరలివెళ్లి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వంటావార్పు కూడా చేపట్టారు. 14వ తేదీన పిల్లాపాపలను వెంటబెట్టుకుని ఇళ్లకు తాళాలు వేసి జిల్లా కేంద్రమైన మెదక్ వరకు పాదయాత్ర చేపట్టి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. గ్రామంలో ఎవరిని తట్టినా కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్రామానికి చెందిన కాటెపల్లి కంసమ్మ ఆంధ్రభూమి ప్రతినిధి ముందు బోరున విలపించింది. తమ ఆధీనంలో ఉన్న భూమికి ఎంతో కొంత ధరను నిర్ణయిస్తే... తాము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పను లు చేపట్టకుండా దొరల కుటుంబం అడ్డుపడుతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్లు లేకపోగా కమ్యూనిటీహాల్ నిర్మాణం, పాఠశాలకు ప్రహరీ నిర్మాణాలు సైతం నిలిచిపోయి సమస్యలు వెక్కిరిస్తున్నాయి. కోర్టులో పెండింగ్‌లో ఉన్న సీలింగ్ కేసు పరిష్కారమైతే గ్రామస్థులకు న్యాయం చేకూరే అవకాశాలు ఉన్నాయని పాపన్నపేట తహశీల్దార్ జంగం రాములు పేర్కొంటున్నారు. కాగా గతంలో పట్టా పాసు పుస్తకాలు పొం దిన రైతులకు రెండవ విడతలో కొత్త పాసు పుస్తకాలు జారీ చేస్తామని తహశీల్దార్ పేర్కొంటున్నారు. ఈ గ్రామంలో ప్రస్తుతం 135 కుటుంబాలు జీవనం సాగిస్తుండగా 700 జనాభా కలిగివుంది. మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా తమకు న్యాయం చేకూర్చలేదని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఈ గ్రామం ఏర్పడి నాలుగు తరాలు గడచిపోతున్నా తమను ఎవరు ఆదుకోవడం లేదని శివ్వయ్య, నర్సింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క బ్యాంకు కూడా ఇప్పటివరకు పంట రుణాలు మం జూరు చేయలేకపోయిందని, ప్రధాన కారణం తమ పేరున పట్టా సర్ట్ఫికెట్లు లేకపోవడమే శాపంగా మారిందంటున్నారు. ప్రభుత్వం స్పందిం చి తమకు న్యాయం చేయాలని దౌలాపూర్ గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
చిత్రం..ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్న దౌలాపూర్ గ్రామస్థులు