తెలంగాణ

2020 నాటికి లక్ష కోట్ల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: 2020 జూన్ నాటికి తెలంగాణలో ఎక్కడ చూసినా ఆకుపచ్చ తెలంగాణే కనబడుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో రూ. లక్ష కోట్ల పంట పండబోతుందన్నారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర రెవిన్యూ ఆదాయం 20 శాతం పెరిగి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సోలార్ విద్యుత్‌లో కూడా తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. పది సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఇసుకపై రూ.39 కోట్ల ఆదాయం వస్తే, తాము కేవలం నాల్గేళ్లలోనే రూ.1675 కోట్ల ఆదాయం వచ్చిందని సీఎం వివరించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ, పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక చరిత్ర అయితే పునర్ నిర్మాణం మరో చరిత్రగా నిలిచిందన్నారు. అధికారం ఇతర పార్టీలకు రాజకీయం అయితే తమకు మాత్రం ఒక టాస్క్ అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు ఓట్ల కోసం కాదని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతోందన్నారు. లబ్ధిదారులు కాంగ్రెస్సా, టీడీపీనా? టీఆర్‌ఎస్సా? అని చూడకుండా అర్హులా? కాదా? అనే చూస్తున్నామన్నారు. డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా అధికారులకే అప్పగించామన్నారు. పథకాల అమలు ఆషామాషి కాదని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ఎన్నికల ప్రణాళికలో లేకున్నా ప్రవేశ పెట్టామని సీఎం గుర్తు చేసారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పథకాలను రూపొందిస్తున్నామన్నారు. ఇదే తమ చిత్తిశుద్ధికి, నిజాయితీకి నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలకు ఒక లక్ష్యమంటూ లేదని, ఎంత సేపు కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ లక్ష్యమంటున్నారన్నారు. ఇదేమి దిక్కుమాలిన లక్ష్యమని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ పార్టీకైనా ఒక లక్ష్యమంటూ ఉండాలని, తమను గెలిపిస్తే ప్రజలకు ఏమి చేస్తామో అది చెప్పాల్సింది పోయి గద్దె దింపుతామని చెబుతున్నారన్నారు. ‘దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరారని దావత్‌లు చేసుకోవడం కాదు, ఆయన పెద్ద బండ మోయడానికి సిద్ధమై వచ్చారన్నారు. టీఆర్‌ఎల్‌లో చేరడం సుఖపడటం కోసం కాదని, కష్టపడటం కోసం వచ్చి చేరారు’ అన్నారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని, దానం నాగేందర్‌కు కూడా పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.