తెలంగాణ

దత్తత ఓకే.. అవగాహన ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23 : గ్రామాలను దత్తత తీసుకునే వారు ఆ గ్రామాల్లో ఎలాంటి పనులు, కార్యక్రమాలు చేపట్టాలో అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామాన్ని తెలుగు సినిమా హీరో మహేష్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించేందుకు మహేష్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవితో కలిసి సచివాలయంలోని ఛాంబర్‌లో మంత్రి జూపల్లిని కలిశారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్యాసంస్థలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని మంత్రి సూచించారు. రోడ్లు, మరుగుదొడ్లు తదితర కార్యక్రమాలపై ప్రభుత్వం నుండి సహాయం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ ప్రజల ఆలోచనా విధానం మారితే సగం సమస్యలు తీరుతాయన్నారు. సిద్ధాపూర్ గ్రామ పంచాయితీపరిధిలో మూడు తండాలు, 460 ఇళ్లు ఉన్నాయని, మలమూత్ర విసర్జనకు 442 ఇళ్లలో సదుపాయం లేదని, తాగునీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నమ్రత శిరోద్గర్ మంత్రి దృష్టికి తెచ్చారు. విద్యుత్ సబ్‌స్టేషన్ శిథిలావస్థలో ఉందని, దాంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతోందని ఆమె గుర్తు చేశారు. ఈ సమస్యలన్నీ వెంటనే ప రిష్కరించాలంటూ మంత్రి ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.

చిత్రం సచివాలయంలో మంత్రి జూపల్లిని కలిసిన సినీ హీరో మహేష్‌బాబు భార్య నమ్రత