తెలంగాణ

ఢిల్లీకి డీఎస్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ ఢిల్లీ పర్యటనపై మళ్లీ ఊహగానాలు ప్రారంభమయ్యాయి. లోగడ పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీకీ అత్యంత సన్నిహితునిగా ఉన్నప్పటికీ చివరికి టీఆర్‌ఎస్‌లో చేరడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్మయం చెందిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆయనకు ప్రభుత్వ సలహాదారునిగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు. అయితే ఆయన్ను రాజ్యసభకు పంపించినప్పటికీ, తనకు సరైన ప్రాముఖ్యత లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై డీఎస్ ప్రతిస్పందిస్తూ తనకు ఎటువంటి అసంతృప్తి లేదని ఆ వార్తలను ఖండించారు. కాగా రెండు రోజుల క్రితం డీఎస్ ఢిల్లీకి వెళ్ళడంతో మళ్ళీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ ఢిల్లీకి వెళితే వార్త అవుతుందా?, పార్లమెంటు సమావేశాలు లేకపోయినప్పటికీ, అక్కడ కమిటీ సమావేశాలు ఉంటాయి కదా? అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఢిల్లీ వెళ్ళిన డీఎస్ మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి చర్చించినట్లు తెలిసింది. డీఎస్ ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తారోనని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన పర్యటనపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొంత మంది డీఎస్‌ను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు.