తెలంగాణ

ఐదు తరాలు దాటినా.. చెదరని చిరునవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, మే 23: మూడు పదుల వయస్సులోనే అడుగు ముందుకు వేయడానికి ఇబ్బంది పడుతుంటాం.. కానీ ఈ అవ్వ వందేళ్లు నిండిన ఇప్పటికీ చలాకీగా పనులు చేస్తోంది.. హుషారుగా మాట్లాడుతోంది. అందరికంటే ముందే నిద్ర లేచి నడక ఆరంభిస్తోంది. తన పనులతో పాటు ఇంట్లోని చిన్న చిన్న పనులను చక్కబెడుతోంది. రోజుకు మూడు పూటలు ఆరగిస్తోంది. చికెన్, మటన్ నమిలేస్తోంది. ఐదవ తరం చూసింది. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గొరిట్యాల బూదవ్వకు కుటుంబీకులు ఆదివారం రాత్రి ఘనంగా శత జన్మదిన వేడుకలు నిర్వహించారు. అందరితో కలసి కేక్ కట్ చేసి ఔరా అనిపించింది. వేడుకల్లో మునిగితేలింది. బూదవ్వ భర్త బాలయ్య 40 ఏళ్ల కిందట చనిపోయారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రాములు గల్ఫ్ దేశానికి వెళ్లొచ్చి స్థానికంగా కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బూదవ్వ కుమారుడు, కుమార్తెల పిల్లలతో పాటు వారి పిల్లలకు కూడా వివాహాలయ్యాయి. ఇప్పటివరకు ఐదు తరాలను చూసిన బూదవ్వ మనుమలు, మునిమనుమలు, మనుమరాళ్లు సహా మొత్తం 50 మందితో కలసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంది. అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అన్నట్లు స్వయంగా వండివార్చింది బూదవ్వ.

చిత్రం బూదవ్వ