తెలంగాణ

16 నుండి ఎమ్సెట్ బైపీసీ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో బి ఫార్మసీ, ఫార్మా డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీం పరీక్షకు హాజరైన బైపీసీ అభ్యర్ధులకు అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను జూలై 16 నుండి 18వ తేదీ వరకూ సమర్పించవచ్చని, 17 నుండి 19 వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని, సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తయిన వారికి వెబ్ ఆప్షన్లను నమోదు చేసే అవకాశం కల్పిస్తామని, తుది అలాట్‌మెంట్ 23న జరుగుతుందని ఎమ్సెట్ అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. 23 నుండి తమ ట్యూషన్ ఫీజులను చెల్లించి, కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
గుర్తింపు చూసుకుని చేరండి
జూనియర్ కాలేజీల్లో చేరినపుడు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాతనే చేరాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చేరితే మున్ముందు సమస్యలు ఉంటాయని, కనుక అడ్మిషన్లకు ముందే కాలేజీల గుర్తింపు అంశాన్ని పరిశీలించుకోవాలని ఆయన హితవు పలికారు.