తెలంగాణ

బీసీ రిజర్వేషన్లను తగ్గించే కుట్రలను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: బీసీ రిజర్వేషన్లను తగ్గించే కుట్రలను ఎట్టిపరిస్థితిలోనూ సహించేది లేదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం హెచ్చరించింది. కోర్టు తీర్పుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. న్యాయస్థానంలో ప్రభుత్వం తరుపున సరిగ్గా వాధించని ఫలితంగా ఇలాంటి తీర్పు వచ్చిందని సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 41 సంవత్సరాలుగా కొనసాగుతున్న రిజర్వేషన్లను దెబ్బతీసే విధంగా తీర్పు వెలువడటం యావత్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను విస్మయానికి గురిచేసిందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేటి నుంచి అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 12న నగరంలో అఖిల పక్ష, కుల, బీసీ సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.