తెలంగాణ

బీసీల హక్కులను హరించే కుట్ర: శ్రవణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: జనాబా ప్రకారం 54 శాతం రిజర్వేషన్లు కోరుతుంగా, 34శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంను ఆశ్రయిస్తామనడం బీసీలకు ఉన్న న్యాయబద్దమైన హక్కులను హరించే కుట్ర కోసమేనని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సర్వే ప్రకారం బీసీల సంఖ్య 52 శాతం ఉందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 34 శాతం కోసం కోర్టుకు వెళ్లడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే బీసీలకు 54శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే 54శాతం రిజర్వేషన్ల కోసం కోర్టుకు వెళ్లాలని అన్నారు.