తెలంగాణ

రైతు బీమాకు 25 లక్షల మంది అర్హులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుజీవిత బీమా (రైతుబంధు బీమా) కు 25.29 లక్షల మంది రైతులు అర్హులని ఇప్పటి వరకు తేలింది. క్షేత్రస్థాయిలో 31.72 లక్షల మంది రైతులను సంబంధిత సిబ్బంది, రైతు సమన్వయ సమితి సభ్యులు సంప్రదించారు. వీరిలో 6.43 లక్షల మంది రైతులు అనర్హులని (వయస్సు ప్రాతిపదికన) తేలింది. కేవలం 18-59 సంవత్సరాల మధ్య వయస్సున్న రైతులే జీవిత బీమాకు అర్హులని ప్రభుత్వం నియమావళి రూపొందించింది. మొత్తం 10,114 గ్రామాల్లో ఇప్పటి వరకు రైతులతో సంప్రదింపులు జరిగాయి. ఈ నెల 15 వరకు రైతుల పేర్ల నమోదు కొనసాగుతుంది. మరో 10 లక్షల మంది రైతుల పేర్లు బీమాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతుబీమా పథకంలో చేరే రైతులు ఏ కారణం చేతనైనా చనిపోతే 5 లక్షల రూపాయల బీమాను సంబంధిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) చెల్లిస్తుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం-ఎల్‌ఐసీ మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది.
బీమా నమోదు అంశంపై వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చించారు. రైతుబీమాలోనమోదైన రైతులకు ఇన్సూరెన్స్ సర్ట్ఫికెట్లు అందచేస్తామన్నారు.
నమోదైన రైతులందరికీ 2018 ఆగస్టు 15న బీమా సమాచారాన్ని మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా చేరవేస్తామన్నారు. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తుండాలని ఆయన ఆదేశించారు.