తెలంగాణ

ప్రజాఉద్యమంలా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే ఉన్నత లక్ష్యంతో చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషి కలెక్టర్లకు సూచించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, రాజీవ్ త్రివేది, ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎంఓ ఎస్‌డీ వర్గీస్‌లు ఇందులో పాల్గొన్నారు. నాల్గొవ విడత హరితహారాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జయశంకర్ భూపాల్‌పల్లి నుంచి ప్రారంభిస్తారని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. వచ్చే ఏడాదికి 100 కోట్ల మొక్కల లక్ష్యాన్ని సీ ఎం నిర్ధేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులలో నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన స్థలాల గుర్తించాలన్నారు.
రాష్టవ్య్రాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రతి జిల్లాల్లో నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటి సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు ఎదరైనప్పుడు ట్యాంకర్ల ద్వారా ప్రతి మొక్కకు నీరు అందేలా అందేలా చూడాలని అన్నారు. ఉపాధి హామి పథకాన్ని హరితహారం కార్యక్రమానికి అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రం మొత్తం పచ్చదనం సంతరించుకునేందుకు సాగుతున్న హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితిలో సహించబోమని హెచ్చరించారు.
విద్యార్థులకు అవగాహన కల్పించండి
భావి తరాల కోసం చేపడుతున్న కార్యక్రమంపై విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. చెట్ల పెంపకం ద్వారా కలిగే ఉపయోగాలపై అవగాహన, ఆసక్తిని పెంచేందుకు ప్రతి పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస పోటలు నిర్వహించాలన్నారు. విద్యార్థికి ఐదు మొక్కల చొప్పున పూలు, పండ్లు, నీడను ఇచ్చేవి ఇచ్చి వాటి పెంపు బాధ్యతను అప్పగించాలన్నారు. వీటితో పాటు కవి సమ్మేళనాలు, సాంస్కృతిక శాఖ ద్వారా కళాజాతరలు నిర్వహించి ప్రచారాన్ని చేపట్టాలని ఆదేశించారు.