తెలంగాణ

ఏడాది పాటు రాజ్‌బహదూర్‌గౌర్ శత జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రైతాంగ సాయుథధ పోరాట వీరుడు, కార్మికవర్గ నాయకుడు డాక్టర్ రాజ బహదూర్ గౌర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం ముఖ్దూంభవన్‌లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఇక్కడ ప్రజా సమస్యలపై స్పందించిన మహానాయకుడు రాజ్ బహదూర్ అని అన్నారు. హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన యోధుడు, కార్మిక నాయకునిగా ఎంతో పేరు గడించారని కొనియాడారు. గౌర్ చరిత్ర, త్యాగాలు, పోరాటాల వివరాలను నేటి తరాలకు తెలియజేసేందుకే ఈ నెల 21 నుంచి వచ్చే సంవత్సరం జూలై 21 వరకు రాష్టవ్య్రాప్తంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పుస్తకరూపంలో తీసుకురానున్నట్టు చెప్పారు. ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళతాననడం పంచాయితీ ఎన్నికలను వాయిదా వేసే కుట్ర కోసమేనని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. గతంలో సుప్రీం కోర్టు 50శాతం రిజర్వేషన్లు మించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అందుకు విరుద్ధంగా ఎన్నికలకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. ఉద్ధేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియ స్థంభింపచేసి తెలంగాణ పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీ ఆర్ చిత్తశుద్ధి ఉంటే సజావుగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.