తెలంగాణ

టాపర్లకు నేడు ఇంటర్ బోర్డు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఇంటర్మీడియట్‌లో టాపర్లుగా నిలిచిన వారిని ఇంటర్ బోర్డు శుక్రవారం నాడు సత్కరించనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ హాజరుకానున్నారు. రాష్ట్ర స్థాయిలో సెంకడియర్ వరకూ తీసుకుంటే ఎస్పీరోడ్ జీజేసీలో చదువుతున్న మేథాజూలూరి (98.5 శాతం), కొహెడ జీజేసీ విద్యార్ధిని కుంభం రమ్య (98.2), బోథ్ జీజేసీ కంఠం హారిక (97.8 శాతం) ఎంపికయ్యారు. వారికి బంగారు పతకాలు అందించనున్నారు. బంగారు పతకాలతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం కూడా ఇస్తారు. ఇక గ్రూప్‌ల వారీ టాపర్లలో బోడ్డపూరి వైష్ణవి (97.7), రేష్మా జాహన్ బేగం (96.2), ఎ స్పందన (96.2), బి కృష్ణ (96.5), ఎల్ సంధ్య (93.4) ఉన్నారు. వొకేషనల్ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన వారిలో ఎన్ జగదీష్, మక్కా శ్రీకాంత్, పెండ్యం శశిప్రియ ఉన్నారు.
ఇక ఫస్టియర్‌లో బి సానియా, పి వైష్ణవి, మహ్మద్ బేగం, దూస రమ్య, జి జాన్సన్, ఎం అనూష, ఎం గంగాభవాని, ఎం జయగుణ, ఇ లావన్య ఉన్నారు.