తెలంగాణ

సైబరాబాథ్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ పరిపూర్ణానంద బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరించి రెండు రోజులు గడవకముందే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి కూడా బహిష్కరించారు. ఇందుకు సంబంధించి ఇరు కమిషనరేట్లు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు కమిషనరేట్ల పరిధి నుంచి బహిష్కరించామని, గడువులోగా వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిపూర్ణానంద కొన్ని చోట్ల చేసిన వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తత, ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించి బషిహ్కరణ చర్యలు తీసుకున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రెండు రోజుల కిందట కాకినాడలోని శ్రీ పీఠంలో పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు వదిలి పెట్టి వచ్చారు. అనంతరం ఆయన గురువారం హైదరాబాద్ వెళ్లకుండా నగర శివారులో తన అనుచరుల వద్ద ఉండేందుకు రావాలని ప్రయత్నించి విమాన టిక్కెట్టు బుక్ చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సత్వరమే ఈ చర్యలు తీసుకున్నారు. తనను హైదరాబాద్ రావద్దని బహిష్కరించారు తప్ప మిగిలిన చోట్ల కాదని భావించి నగర శివారు ప్రాంతానికి రావాలని ప్రయత్నించారు. దీంతో స్వామిని ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రవేశించకుండా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆయన గానీ మళ్లీ గడువులోగా రావాలని ప్రయత్నిస్తే తెలంగాణ వ్యాప్తంగా బహిష్కరించే ఆలోచనలో పోలీసు శాఖ ఉంది. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే విధంగా ఎవరు మాట్లాడినా కఠినంగా అణచివేయాలని ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించడంతో పోలీసులు ఈ బహిష్కరణ అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే సినీ రచయిత, విశే్లషకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా మతపరమైన, సున్నితమైన అంశాలపై చర్చాగోష్టులు నిర్వహించడం, వివాదాస్పద అంశాలను పదే పదే ప్రసారం చేస్తున్న టివి న్యూస్ చానల్స్‌కు కూడా పోలీసులు నోటీసుల జారీ చేసి హెచ్చరించారు. ప్రజల మధ్య విభేధాలు, ఉద్రిక్తతలు సృష్టించే ఎలాంటి వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యక్తుల ప్రకటనలు ప్రసారం చేయడం, వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చట్టప్రకారం నిషిద్దమని పేర్కొంటూ సామాజిక బాధ్యతగా తమకు సహకరించాలని కోరారు. లేదంటే చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.