తెలంగాణ

కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలకే ‘మేడిగడ్డ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూలై 12: సీఎం కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ, మరోవైపు వెయ్యి కోట్ల ఆర్థిక భారం నెపంతో ‘ప్రాణహిత’ కనుమరుగు చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత టీ. తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. 2019 ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనంటూ ప్రాణహితకు జీవం పోస్తామని అన్నారు. గురువారం జగిత్యాలలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా చేతుల్లోకి తీసుకున్న తెలంగాణను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. రెండు బ్యారేజీలు, రెండు లిఫ్ట్‌ల నిర్మాణంతో తెలంగాణ ప్రజలపై రూ. 20 వేల కోట్ల ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. అసలు ప్రాజెక్టు వ్యయం 38వేల కోట్లు కాగా సీఎం నిర్వాకం వల్ల లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. వెయ్యి కోట్ల ఆర్థిక భారం అని చెబుతూ ప్రాణహితను కనుమరుగు చేస్తున్న సీఎం కేసీఆర్ తన ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు చేస్తున్న వెయ్యి కోట్ల మాటేమిటన్నారు. సీఎం మేడిగడ్డ పంప్ హౌస్ నిర్మాణం ముఖ్యమంత్రి చేస్తున్న అతిపెద్ద తప్పు అని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం కోసం తమ హయాంలో తలపెట్టిన ప్రాణహితను కనుమరుగు చేసేలా ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కోసం వార్థా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రయత్నాలు చేయడం సీఎం కేసీఆర్ అవివేకం అన్నారు. వార్థా- పెనుగంగల సమ్మేళనమే ప్రాణహిత అంటూ వార్థా ద్వారా కేవలం 33శాతం నీటిని లభ్యత మాత్రమే ఉండగా పెనుగంగ ద్వారా 67శాతం వరకు నీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రాణహితకు రూ. 2వేల కోట్ల వ్యయం అవుతుండగా, రూ. వెయ్యి కోట్ల ఆర్థిక భారం నెపంతో కేవలం వార్థా ప్రాజెక్ట్ నిర్మాణానికే పూనుకోవడం అసమంజసమన్నారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు హయాంలో ప్రాణహితతో ఒప్పందం జరిగిందన్నారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత చేపట్టినట్లైతే ప్రయోజనం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ 1100టీఎంసీల నీటి లభ్యత ప్రాణహితలో ఉందని, ప్రతి రోజూ సముద్ర గర్భంలో వృథాగా పోతున్న నీటిని కాపాడుకుందామని, ప్రకటించిన మాటలు విస్మరించారని అన్నారు. కేసీఆర్ తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే మేడిగడ్డ పంప్ హౌస్‌ను పర్యాటక ప్రాంతంగా తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ సందర్శకులు సైతం ఈ పరిస్థితిని గమనించాలని జీవన్‌రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.