తెలంగాణ

పొంగుతున్న వాగులు, వంకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, జూలై 12: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయ. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కుమ్రం భీం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లను ఎత్తివేసి 13,376 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 35000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తి నీటిని బయటకు వదలుతున్నారు. 12 రోజలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 5844.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఆసిఫాబాద్ మండలంలో 332.0మిమీ, జైనూర్‌లో 558.8మిమీ, సిర్పూర్ (యు)లో 419.6, తిర్యాణిలో 410.4, రెబ్బెనలో 301.4, కెరెమెరిలో 337.0, వాంకిడిలో అత్యధికంగా 602.0మిమీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కాగజ్‌నగర్ డివిజన్‌లోని కాగజ్‌నగర్ మండలంలో 460.8 మిమీ, సిర్పూర్ (టి) లో 521.6, కౌటాలలో 513.6, బెజ్జూర్‌లో అత్యధికంగా 761.6, దహెగాంలో 625.4మిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 10 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం పైన వర్షపాతం నమోదుకాగా రెండు మండలాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

చిత్రం..భీం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్న దృశ్యం