తెలంగాణ

ఎట్టకేలకు ఈడేరిన డిఎస్ కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 26: రాజ్యసభలో సభ్యత్వాన్ని దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కొనసాగాలనే డి.శ్రీనివాస్ కల ఎట్టకేలకు తెరాస ద్వారా నెరవేరుతోంది. ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రకటించడంతో డిఎస్ అనుచరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణకు సంబంధించి ఖాళీ అయిన రెండు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా, అనేకమంది రాజ్యసభ రేసులో కొనసాగినప్పటికీ తెరాస అధిష్ఠానం డిఎస్ వైపే మొగ్గు చూపడం విశేషం. ప్రస్తుతం డిఎస్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కొనసాగుతుండగా, మరో మూడు మాసాల్లో పదవీ కాలం ముగియనుంది. ఈ తరుణంలో కీలకమైన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో పెద్దల సభలోకి డిఎస్ అడుగు పెట్టడం లాంఛనంగానే మారింది. వాస్తవానికి ఆయన చాలాకాలం నుండే రాజ్యసభ సభ్యత్వం కోరుతూ తనవంతు ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగుతూ అనేక కీలక పదవులు నిర్వర్తించిన డిఎస్ అనూహ్యంగా కాంగ్రెస్‌ను వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు తెరాసలో చేరిన కొన్నాళ్లకే డిఎస్‌కు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారు. ప్రస్తుతం రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టడం ద్వారా డిఎస్ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని కెసిఆర్ చాటుకున్నట్లయ్యింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండి, జాతీయ స్థాయి నాయకులతో డిఎస్ సత్సంబంధాలతో మెలుగుతుండడం కూడా ఆయన వైపు కెసిఆర్ మొగ్గు చూపేందుకు కారణమైందని తెలుస్తోంది. తెలంగాణ ప్రగతికి తన సుదీర్ఘ అనుభవాన్ని జోడించి పనులను చక్కబెడతారనే నమ్మకంతో రాజ్యసభ సభ్యత్వానికి డిఎస్‌కు అవకాశం కల్పించినట్టు పరిశీలకులు విశే్లషిస్తున్నారు.