తెలంగాణ

జర్నలిస్టుల సేవలను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 13: సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని.. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు పలు హామీలు ఇచ్చారని వాటిని నేరవేర్చాల్సిన అవసరం ఉందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజే యూ) మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుల బాధ్యత సమాజంలో చాలా గొప్పదని వెల్లడించారు. కేంద్ర, రాష్టస్థ్రాయిలో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటి పరిష్కారం కోసం గత యూపీయే ప్రభుత్వంలో, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వాలపై తాము ఒత్తిడి తీసుకువచ్చామని దాంతో కొన్ని సమస్యలను పరష్కరించుకోగలిగామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు హామీ ఇచ్చారని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే తమ నియోజకవర్గస్థాయిలో జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వాటి పరిష్కారం పార్లమెంట్‌లో ఉందని ఆమర్‌లాంటి నాయకులు తన దృష్టికి తీసుకురావడంతో తాను ప్రత్యేకంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలను లేవనెత్తుతన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను పాటుపడుతున్నానని దాదాపు 100డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తున్నట్లు వాటికి ఇప్పటికే శంకుస్థాపన కూడా చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు వ్యవస్థ చాలా గొప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో వార్తలు రాస్తే జర్నలిస్టులను మెచ్చుకునేవారని వాటిని విశే్లషించుకునే నాయకులు ఉండేవారన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో ఐజేయూ మహాసభలో ప్రసంగిస్తున్న ఐజేయూ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్