తెలంగాణ

గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపిన సీఎం సర్వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపు ఓటములపై తాజాగా నిర్వహించిన సర్వేల కథనాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో అలజడి రేపాయి. మూడు దఫాలుగా సీఎం కేసీ ఆర్ జరిపించిన సర్వేల మేరకు 20నుండి 30మంది సిట్టింగ్‌లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమేనని, వారిలో అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా టీఆర్‌ఎస్ నుండి గత ఎన్నికల్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట నుండి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ తుంగతుర్తి నుండి, వేముల వీరేశం నకిరేకల్ నుండి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడు నుండి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత ఆలేరు నుండి, పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి నుండి గెలిచారు. కాంగ్రెస్, సీపీఐల నుండి గెలిచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారితో కలిపి ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉండగా వీరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి మినహా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సర్వేల మేరకు టికెట్ డౌట్ లిస్టులో ఉన్నట్లుగా సర్వేల ప్రచార కథనం. అయితే పనితీరు మెరుగుపరుచుకుంటే ఇందులో ఇద్దరు ముగ్గురికి టికెట్ ఆశలు సజీవంగానే ఉంటాయని తెలుస్తోంది. సర్వేల ఫలితాలను విశే్లషించిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కావాల్సిన కసరత్తు చేసుకోవాలంటు పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్‌లు చేయడం గులాబీ ఎమ్మెల్యేలను మరింత కలవరపరిచింది. సీఎం నుండి ఫోన్‌లు రాని ఎమ్మెల్యేల్లో జిల్లా నుండి ఎవరేవరు ఉన్నారన్న అంశం ప్రస్తుతం గులాబీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, గులాబీ బాస్ కేసీఆర్ తన సర్వేల ఆధారంగా నిజంగానే సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తే మంత్రి జగదీశ్‌రెడ్డి సహా ఈ జిల్లాలో ఏడుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించడం అది అతిపెద్ద సాహసంగానే చెప్పవచ్చు. ఎనిమిది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మినహా మిగతా వారంతా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినవారే కావడం విశేషం. వీరంతా మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఎంతో ఆశతో ఉన్నారు. వీరికి టికెట్లు నిరాకరిస్తే వారి స్థానంలో పోటీ చేసే కొత్తవారికి ఎంతమేరకు సహకారం లభిస్తుందన్నది ప్రశ్నార్థకమే. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సరైన ప్రత్యామ్నాయ నాయకులు సైతం ప్రస్తుతానికి లేరన్న వాదన ఉంది. టికె ట్లు అనుమానమేనన్న సిట్టింగ్‌లలో మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు సైతం వినిపించడం జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. జగదీశ్‌రెడ్డిని మరో నియోజకవర్గానికి మారుస్తారని లేక నల్లగొండ ఎంపీగా బరిలోకి దించుతారని లేక ఎమ్మెల్సీగా అవకాశమిస్తారన్న ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వీరేశం, గాదరి కిషోర్, గొంగిడి సునిత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌లకు టికెట్లు నిరాకరించిన పక్షంలో వారిని ఏ విధంగా సంతృప్తి పరుస్తురాన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. సీఎం కేసీఆర్ సర్వేల మేరకు టికెట్ల డౌట్ జాబితా ప్రచారంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.