తెలంగాణ

పర్సన్ ఇన్‌చార్జీలుగా మమ్మల్నే కొనసాగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లుగా కొనసాగుతున్న వారినే పర్సన్-ఇంచార్జీలుగా నియమించాలని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న కోరారు. భూమన్నతో పాటు పలువురు సర్పంచ్‌లు శనివారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించవద్దని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడంలో సర్పంచ్‌లు చేసిన కృషి మరువలేనిదని వారు గుర్తు చేశారు. ప్రత్యేక అధికారులను నియమిస్తే గ్రామాల్లో సమస్యలు తలెత్తుతాయని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు సజావుగా సాగవన్నారు. అందువల్ల తమనే పర్సన్-ఇన్-చార్జీలుగా నియమించాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని కడియం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.