తెలంగాణ

ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: రోడ్లు, భవనాలు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తుమ్మల చేత శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, కార్యదర్శి రాజా సదారామ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తుమ్మల రెండు రోజుల కిందట తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, పాయం వెంకటేశ్వర్లు, పాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాసాని లక్ష్మినారాయణ, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తదితరులతో కలిసి శాసనసభకు ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్‌కు చేరుకున్న తుమ్మలతో స్పీకర్ మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం చేయించగా, ఈ కార్యక్రమానికి మంత్రులు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, చందులాల్, మహేందర్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇలా ఉండగా తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరునున్నట్టు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో భాస్కర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణ స్వీకారం ముగిసిన సమయంలో వైసిపి తరఫున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన విజయసాయిరెడ్డి వెంట వచ్చిన నేతలు పనిలో పనిగా తుమ్మలను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.