తెలంగాణ

ఉన్నత విద్యను గాడిలో పెట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యను గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని వివిధ విశ్వవిద్యాలయాలకు పనిచేసిన మాజీ వైస్ ఛాన్సలర్లు అభిప్రాయపడ్డారు. చాలా కాలం పాటు రీడర్లు, ప్రొఫెసర్లుగానూ, వైస్ ఛాన్సలర్లుగా పనిచేసిన దాదాపు డజనుమంది విద్యావేత్తలు తెలంగాణ రాష్ట్ర మాజీ వీసీల ఫోరం పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలను కాపాడటం, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై స్పందించడం, ఉన్నత విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడటం, ప్రభుత్వానికి ఎప్పటికపుడు తగిన సూచనలు, సలహాలు అందజేయడం లక్ష్యంగా ఈ ఫోరం ఏర్పాటు చేసినట్టు వారు చెప్పారు. ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ వై వైకుంఠం, ప్రొఫెసర్ విద్యావతి, ప్రొఫెసర్ ఎన్ గోపి, ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ భాగ్యనారాయణ, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, ప్రొఫెసర్ వెంకటరత్నం, ప్రొఫెసర్ భూమయ్య, ప్రొఫెసర్ లింగమూర్తి, ప్రొఫెసర్ కె లాల్ కిశోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే ఈ ఫోరం ద్వారా పలు కార్యక్రమాలను అమలు చేస్తామని వారు చెప్పారు.