తెలంగాణ

ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు నిర్వహించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ సమావేశంలో నిర్ణయించారు. శనివారం ఎన్‌టీఆర్ ట్రస్ట్భ్‌వన్‌లో తెలుగు యువత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరేందర్ గౌడ్, దీపక్ రెడ్డిల ఆధ్వర్యంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై ప్రభుత్వ వైఫల్యాలు, విద్యార్ధులు, నిరుద్యోగుల సమస్యలపై చేయాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలోనే విద్యార్థి విభాగానికి రాష్టస్థ్రాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.