తెలంగాణ

ఉన్నత విద్యా కమిషన్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ఉన్నత విద్యా కమిషన్ ప్రతిపాదనను విరమించుకోవాలని హైదరాబాద్‌కు చెందిన మేథావుల ఫోరం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరింది. ఈ మేరకు విద్యావేత్తలు, విద్యా నిపుణుల, మేథావుల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి కేంద్ర మంత్రి జవదేకర్‌కు పంపిస్తున్నట్టు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ అనాలసిస్ (సీరా) కన్వీనర్ ఎన్ నారాయణ చెప్పారు. ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి చరిత్ర, సిద్ధాంతం కనిపించడం లేదని, కేవలం అదో ప్రతిపాదనగా మాత్రమే కనిపిస్తోందని, అందులో ఎలాంటి విధానం కానరావడం లేదని నారాయణ పేర్కొన్నారు. ఉన్నత విద్యా స్థితిగతులపై లోతైన సమగ్ర అధ్యయనం ఈ మధ్య కాలంలో జరగలేదని, అందుకు నిష్ణాతులతో కూడిన ఎలాంటి కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించలేదని, అలాగే ఎలాంటి సమీక్ష కూడా జరగలేదని నారాయణ పేర్కొన్నారు. ఉన్నత విద్య అమలులో , ప్రణాళికలో ఉన్న లోపాలను గుర్తించడంలో కేంద్రం విఫలమైందని, వాస్తవికంగా ఉన్న లోపాలు ఒకటైతే, కేంద్రం వేరే అంశంపై పనిచేస్తోందని ఇది సరికాదని చెప్పారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కేవలం నిధులు మంజూరు చేసే సంస్థగా కేంద్ర మానవ వనరుల మంత్రి చూడటం సహేతుకం కాదని, యూజీసీ ఎనలేని సేవలను అందించిందని, నిధులను సైతం ఆయా సంస్థల ప్రామాణిక ఎదుగుదల ప్రాతిపదికగానే అందించడం జరిగిందని, పరోక్షంగా పలు సంస్థలు విస్తృతం కావడానికి, ప్రమాణాలు పెంచుకోవడానికి యూజీసీ ఎంతో కృషి చేసిందని అన్నారు. స్వతంత్ర సంస్థ ఆధీనంలో ఉన్నపుడే ఉన్నత విద్యాసంస్థలు వికసిస్తాయని, ఇంతకాలం యూజీసీ స్వతంత్రంగానే వ్యవహరించిందని అన్నారు. యూజీసీతో పోలిస్తే ఉన్నత విద్యా కమిషన్ అంత స్వయంప్రతిపత్తి సంస్థగా చూడలేకపోతున్నామని, కమిషన్ ఏర్పాటు వెనుక రాజకీయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల వల్ల ఎస్సీలు 19.9 శాతం, ఎస్టీలు 14.2 శాతం మంది ఉన్నత విద్యలో ఉన్నారని, అదే ప్రైవేటు సంస్థలు కుమ్ముకువస్తే బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందని ద్రాక్ష అవుతుందని అన్నారు.