తెలంగాణ

సీసీటీవీ ప్రాజెక్టుతో నేరాలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ‘నేను సైతం’ పేరుతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన కమ్యూనిటీ సిసిటివి ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. నగరంలో నేరాల తగ్గుదలకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. అంతేకాకుండా చాలా కీలక కేసుల్లో సిసిటివి ఫుటేజీలు సాక్ష్యాలుగా మారి నిందితులను చట్టానికి పట్టి ఇచ్చాయని గుర్తు చేశారు. శనివారం నాడిక్కడ జెఎన్‌టియు ఆడిటోరియంలో నిర్వహించిన 31 జిల్లాల సిసిటివి ఇంటెగ్రేటర్ల సమావేశంలో మంత్రి నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నేను సైతం ప్రాజెక్టుపై షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించారు. మంత్రి ప్రసంగిస్తూ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 10 లక్షల సిసిటివి కెమెరాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. గత నాలుగేళ్లలో సిసి కెమెరాల వల్ల ఒక్క గ్రూప్ ఘర్షణ చోటు చేసుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లో విజయవంతం అయిన ఈ ప్రాజెక్టును రాష్ట్రం మొత్తం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
డిజిపి ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి 2017 వరకు హైదరాబాద్ నగరంలో సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అంతర్ రాష్ట్ర నేరగాళ్లను పట్టించడంలో కెమెరాల పాత్ర చాలా ఉన్నందున వారి కదలికలు తగ్గాయని తద్వారా సంచలనాత్మక నేరాలు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్న సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే సిసిటివి నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు.