తెలంగాణ

అధికార పక్షమా? ప్రజల పక్షమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, మే 26: కార్మిక క్షేత్రంగా అనేక పోరాటాలకు పురిటిగడ్డ అయిన ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి నాడు సింగరేణి విధానాలతో చిన్నాభిన్నమైంది. ఇక్కడి ప్రజలు బొగ్గు గనుల మూసివేతతో చెల్లాచెదురయ్యారు. పట్టణ మనుగడ, అభివృద్ధి రాజకీయ నాయకులకు విలాస వస్తువులుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి జేబులో పెన్నుగా మారిపోయింది. జిల్లాలోని తూర్పు ప్రాంతానికి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కలిగి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండే ఈ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, ఇక్కడ ఖాళీగా ఉన్న సింగరేణి భవనాల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలను వెనువెంటనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ జిల్లా కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి జిల్లా సాధన ఉద్యమానికి పురుడు పోశారు. ఇందుకు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపారులు ఒక్కటై బెల్లంపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నారు. గత పదిహేను రోజులుగా నిరంతర పోరాట కార్యక్రమాలు బెల్లంపల్లిలో జరుగుతూనే ఉన్నాయి. ఈ పోరాటాన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఉవ్వెత్తిన చాటి ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఇంత ఉద్యమం ఉధృతంగా జరుగుతుండగా బెల్లంపల్లి జిల్లా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెనె్నల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ప్రొఫెసర్ కోదండరాం జెఎసి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తన ఇలాకా అయిన పోరుగడ్డ బెల్లంపల్లిలో ఉద్యమాలు ఉధృతంగా జరుగుతున్నా తనకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన వైఖరిపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి రాష్ట్ర సాధనకు తన కర్తవ్యాన్ని నెరవేర్చిన వారిలో ఒకరిగా నిలిచారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావనలోకి తేవడంతో అసలు ప్రాధాన్యత గల ప్రాంతాల్లో జిల్లాలను ప్రకటించకపోవడంతో ఉద్యమాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లిని జిల్లా చేయాలనేది తూర్పు ప్రాంత ప్రజల్లో ప్రదాన సమస్యగా నిలిచిపోయింది. కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కోదండరాం అధికార పక్షమో, ప్రజల పక్షమో అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ అమెరికాలో గడిపిన కోదండరాం బెల్లంపల్లి జిల్లా విషయమై తన వైఖరిని తెలపకపోవడం ఈ ప్రాంత ప్రజలు, మేధావులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోదండరాం వౌనం ప్రభుత్వ వైఖరికి బలం చేకూరుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్న మంచిర్యాల జిల్లాకే కోదండరాం మద్దతు ఇస్తున్నారనే సంకేతాలు చెప్పకనే చెబుతుందని విశే్లషకులు పేర్కొంటున్నారు. బెల్లంపల్లి జిల్లా ఆకాంక్షను మంచిర్యాల నియోజకవర్గం మినహా బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు కావాలని కోరుతుండగా, జిల్లాకు చెందిన ప్రముఖుల్లో ఒకరైన కోదండరాం మాట చెబితేనే ఏ అంశమైనా అటు ప్రభుత్వం, ఇటు ప్రజల్లో అన్నిపక్షాల్లో చర్చనీయాంశమవుతోంది.