తెలంగాణ

ఇంజనీరింగ్‌లో సాయితేజ అగ్రికల్చర్‌లో ప్రదీప్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్ స్ట్రీంలో హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన తాళ్లూరి సాయి తేజ ఇంజనీరింగ్ స్ట్రీంలో 160 మార్కులతో టాపర్‌గా నిలవగా, మాదాపూర్‌కు చెందిన దిగుమర్తి చేతన్ సాయి 159 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. మాదాపూర్‌కే చెందిన గుండా నిఖిల్ సామ్రాట్ మూడో ర్యాంకు సాధించగా, కొండా విఘ్నేశ్‌రెడ్డి నాలుగో ర్యాంకు, గుంటూరుకు చెందిన చండూరు రాహుల్ ఐదో ర్యాంకు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన బండారు వెంకట సాయి గణేశ్ ఆరో ర్యాంకు, విజయనగరం తోటపాలెంకు చెందిన కొండేటి తన్మయి ఏడో ర్యాంకు, ఏలూరుకు చెందిన గంటా గౌతమ్ 8వ ర్యాంకు,గుంటూరు మంగళగిరికి చెందిన నంబూరు జై కృష్ణ సాయి వినయ్ 9వ ర్యాంకు, విశాఖ లలితానగర్‌కు చెందిన ఎస్ కృష్ణారెడ్డి 10వ ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్ స్ట్రీంలో...
అగ్రికల్చర్ స్ట్రీం టాపర్‌గా బొజ్జ ప్రదీప్ రెడ్డి నిలిచాడు. ఎంసెట్‌లో 160కి 160 మార్కులను సాధించిన ప్రదీప్‌రెడ్డి కడప జిల్లా గాలివీడుకు చెందిన వాడు, రెండో స్థానంలో సామల ప్రత్యూష నిలిచింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రత్యూష ఎంసెట్‌లో 160 మార్కులు సాధించింది. మూడోస్థానంలో కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మహ్మద్ అర్బాజ్, సికింద్రాబాద్‌కు చెందిన వి ప్రణతి నాలుగో స్థానంలో హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన అమ్మకోల యజ్ఞప్రియ ఐదో స్థానంలోనిలిచారు హైదరాబాద్ బహుదూర్‌పురకు చెందిన జీహన్ అహ్మద్ జలీలి 159 మార్కులు సాధించి ఆరోస్థానంలో, హైదరాబాద్ నిజాంపేటకు చెందిన రాజుపాలెం ఉజ్వల్, వరంగల్ కాజీపేటకు చెందిన తంగేడ కౌశిక్ 159 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. విశాఖపట్టణానికి చెందిన పెదిరెడ్ల శైలజ 159 మార్కులతో 9 వ ర్యాంకు సాధించగా, నల్గొండ మిర్యాలగూడకు చెందిన అప్పల శ్రీనిధి 159 మార్కులతో పదో ర్యాంకు సాధించాడు.