తెలంగాణ

ఎన్నికల్లో పోటీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఇప్పటి వరకు ఎన్నికల విధానానే్న తప్పుపట్టిన గద్దర్ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆదివారం బీఎల్‌ఎఫ్ నిర్వహించిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న గద్దర్ ఈ మేరకు ప్రకటన చేశారు. లాల్-నీల్ జెండాల కలియికతో తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తోందని అన్నారు. బహుజనులంతా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్న వేళ బీజేపీ సైతం అంబేధ్కర్ విధానాలంటూ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని తన సతీమణితో సైతం చర్చించానని తాను కూడా తనతో పాటు పోటీకి సై అంటుందని ఛమత్కరించారు. బహుజనుల్లో చైతన్యం పెరుగుతున్న వేళ వామపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎర్రజెండాల మధ్య ఐక్యతను తీసుకురావాలని సీతారామ్ ఏచూరిని ఆయన కోరారు. గద్దర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, గద్దర్ పోటీ చేస్తే భారీ మెజారిటితో గెలిపించుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రకటించారు.