తెలంగాణ

గజ్వేల్‌లో విద్యాసౌధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 15: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుండగా, నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో రూ. 148 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్ రాష్ట్రానికే తలమానికం కానుంది. సీఎం కేసీఆర్ సంకల్పబలంతో 10వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందనుండగా, 2వేల మంది విద్యార్థులకు హాస్టల్ వసతి సమకూరింది. నూతన విద్యా వ్యవస్థకు బీజం వేస్తూ 2015, మే 9వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, డిప్యూటీ ఈఈ రాంచంద్రం ప్రత్యేక కృషితో నిర్మాణాలు చివరిదశకు చేరుకున్నాయి. గత విద్యా సంవత్సరం నుండి ఎడ్యుకేషన్‌హబ్‌లో విద్యాబోధన జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగిన అనంతరమే ప్రారంభోత్సవం చేయాలనే సీఎం కేసీఆర్ సూచనలతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అయితే, మరో 10 రోజుల్లో ఎడ్యుకేషన్ హబ్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతి రెండు రోజుల కోసారి కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి తనిఖీలు చేపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 10వేల దరఖాస్తులు
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రవేశం పొందేందుకు ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మెన్‌లు, ఇతర ప్రతినిదులు రికమండ్ చేయడం విశేషం.

చిత్రం..గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యా సౌధం భవనాలు