తెలంగాణ

‘కాళేశ్వరం’ విద్యుత్ పనులకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది పంపుహౌజ్‌లకు, తొమ్మిది సబ్ స్టేషన్లను నిర్మించే ప్రక్రియకు గురువారం శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తొమ్మిది విద్యుత్ సబ్‌స్టేషన్లను 18 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు రోడ్‌మ్యాప్ తయారుచేశారు. తొమ్మిది పంపుహౌజ్‌లలో ఆరింటికి 400కెవి సబ్ స్టేషన్లను నిర్మించనున్నారు. మరో రెండు పంప్‌హౌజ్‌లకు 220కెవి సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. 132కెవితో ఒక సబ్‌స్టేషన్ నిర్మిస్తారు. కాళేశ్వరానికి చెందిన 6, 8, 9, 10, 11 ప్యాకేజీలతో పాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్ల పనుల వేగం పెంచుతున్నారు. ఇప్పటికే ప్యాకేజీ 68కి టెండర్లు పిలిచారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూ సేకరణ పనులు ఊపందుకున్నాయి. గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్య ప్రకాశ్, తెలంగాణ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఇరిగేషన్ సిఇలు వెంకటేశ్వర్లు, హరిరాం, ట్రాన్స్‌కో సిఇలు ప్రభాకర్, లత తదితరులు పాల్గొన్నారు.
అలసత్వాన్ని
సహించేది లేదు: హరీశ్‌రావు
కోటి ఎకరాలకు సాగునీటిని అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని, అవినీతిని సహించేది లేదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పనితీరు మెరుగు పరుచుకోవడంలో విఫలం అవుతున్న ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిపై వేటు వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నల్లగొండ చీఫ్ ఇంజనీర్ పురుషోత్తమరాజును బదిలీ చేశారు. వరంగల్ ఎస్‌ఇ విజయభాస్కర్‌ను సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు ఖాళీలను సైతం భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయడానికి వీలుగా ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో సిఇని, జిల్లా కోక ఎస్‌ఇని నియమించారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 25వేల కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు.