తెలంగాణ

వనజీవి రామయ్య సవాల్‌ను స్వీకరించిన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: పద్మశ్రీ అవార్డు గ్రహీత, తన జీవితాన్ని మొక్కలు నాటేందుకే అంకితం చేసిన వనజీవి రామయ్య సవాలును మంత్రి జోగు రామన్న స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా వనజీవి రామయ్య గవర్నర్ నర్సింహన్, ముఖ్యంత్రి కేసీఆర్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్నలకు మొక్కలు నాటాలని సవాలు విసిరారు. ఆదిలాబాద్ నుంచి దీనిని స్వీకరించిన మంత్రి జోగు రామన్న జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో మూడు మొక్కలను నాటారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూధాన చారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలకు సవాలు విసిరారు. వనజీవి రామయ్య తనకు గ్రీన్ ఛాలెంజ్ విసరడం తనకు ఎంతో సంతాషాన్ని ఇచ్చిందని, దీనిని ప్రతి ఒక్కరూ స్వీకరిస్తే రాష్ట్రం పచ్చదనంతో నిండిపోతుందని జోగు రామన్న అన్నారు.

చిత్రం..ఆదిలాబాద్‌లోని బీసీ హాస్టల్‌లో మొక్క నాటి
నీరు పోస్తున్న మంత్రి జోగు రామన్న