తెలంగాణ

శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లపై శే్వతపత్రం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఇండ్లపై ప్రభుత్వం రెండేళ్లు గడచినా విధాన నిర్ణయం సరైన రీతిలో తీసుకోలేదన్నారు. ఒక ఏడాదిలోగా లక్ష ఇండ్లను జిహెచ్‌ఎంసి పరిధిలో, మరో లక్ష ఇండ్లను రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారన్నారు. ఈ హామీ ఇచ్చి నాలుగు నెలలు గడచినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. ఈ పథకానికి నిధుల సేకరణపై విధి విధానాలను ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదన్నారు. నిరుడు దసరా రోజు 60 వేల ఇండ్లకు శంకుస్థాపనలు చేసి, ఆరునెలల్లో పూర్తి చేస్తామన్నారని, కాని వాటి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన లబ్ధిదారుల్లో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది పట్టాపొందారన్నారు. కానీ ఆ కుటుంబంలో ముగ్గురికి మాత్రమే అర్హత ఉందన్నారు. 11 మంది లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి అర్హులైన లబ్దిదారులకు పట్టాలు ఇవ్వాలన్నారు. మంత్రి తలసాని మద్దతుతో వీరు ఇండ్లను అక్రమించుకున్నారన్నారు. వీరిని వెంటనే ఇండ్ల పట్టాను రద్దు చేయాలని ఆయన కోరారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పంపకంలో కుటుంబానికి ఒకటి మాత్రమే ఇవ్వాలనే నియామాన్ని ఉల్లంఘించడంపై విచారణ జరపాలని ఆయన కోరారు.