తెలంగాణ

గొంతులో దిగిన చెట్టు కొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిచ్కుంద/బాన్సువాడ, మే 26: నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గేట్ వద్ద గురువారం మధ్యాహ్నం సమయంలో ఈదురుగాలులు కొద్దిసేపు బీభత్సం సృష్టించాయి. బలంగా వీచిన ఈదురుగాలుల తాకిడికి ఓ చెట్టు కొమ్మ విరిగి, అదే సమయంలో ఈ మార్గం గుండా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ గొంతులో దిగబడింది. వెంటనే డ్రైవర్‌ను బిచ్కుంద ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసి గొంతు భాగంలో ఇరుక్కున్న చెట్టు కొమ్మను వైద్యులు తొలగించారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్లు గోపాల్, ముదస్సిర్ హుస్సేన్‌లు విత్తన లోడ్‌తో ఉన్న లారీని హైదరాబాద్ నుండి రాజస్థాన్‌కు తీసుకెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎస్‌ఎన్‌ఎ రహదారిపై గల పత్లాపూర్ గేటు సమీపంలోకి చేరుకోగా, అదే సమయంలో వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి ఓ చెట్టు కొమ్మ విరిగి లారీపై పడింది. క్యాబిన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న గోపాల్ గొంతులోకి ఓ కొమ్మ గుచ్చుకుపోయంది. అతనిని హుటాహుటిన బిచ్కుంద ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన మీదట బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సివిల్ సర్జన్ డా. చంద్రమోహన్ శస్తచ్రికిత్స చేసి గోపాల్ గొంతులో ఇరుక్కున్న కొమ్మను తొలగించారు. ప్రస్తుతం గోపాల్‌కు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో ముదస్సిర్‌కు కూడా కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.

chitram ఈదురుగాలులకు విరిగిన చెట్టుకొమ్మ డ్రైవర్ గోపాల్ గొంతులో ఇరుక్కున దృశ్యం