తెలంగాణ

పల్లె నుంచి పట్నం దాకా అదిరిపోయేలా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకలను కనీవిని ఎరగని రీతిలో రాష్టవ్య్రాప్తంగా గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. అలాగే దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు వివిధ రాష్ట్రాలలో కూడా జాతీయ పండుగలాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉప సంఘం చైర్మన్ నాయిని నరసింహ్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర ఆవతరణ వేడుకలపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, చందులాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్, ఎస్‌పి సింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు నిర్ణయాలను ఉప సంఘం తీసుకున్నట్టు చైర్మన్ నాయిని నరసింహ్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఆ విషయాన్ని తెలియజేసే విధంగా మీడియాలో అన్ని భాషల్లో విస్తృతంగా ప్రకటనలు జారీ చేయనున్నట్టు నాయిని నరసింహ్మారెడ్డి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 50 కిలోల స్వీట్లు, గ్రామాలలో 25 కిలోల స్వీట్లు పంచనున్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. రాష్ట్ర ఆవతరణ వేడుకల రోజున ముఖ్యమంత్రి కెసిఆర్ సంజీవయ్య పార్క్‌లో అతి పెద్ద జాతీయ పతకాన్ని ఆవిష్కరించడంతో పాటు అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి నాయిని వివరించారు.

chitram సచివాలయంలో గురువారం రాష్ట్ర ఆవతరణ వేడుకలపై సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం