తెలంగాణ

సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: రాష్ట్రంలో రైతులకు సెనగ, వేరుసెనగ విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సెనగ (జేజీ-11, ఇతర రకాలు) విత్తనం ధర క్వింటాల్‌కు మార్కెట్‌లో 6500 రూపాయలు ఉండగా, ప్రభుత్వం 2275 రూపాయలు సబ్సిడీగా ఇస్తోంది. అంటే క్వింటాల్ సెనగ విత్తనం 4225 రూపాయలకే రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పల్లి (వేరుసెనగ) విత్తనం (కే-6, ఇతర రకాలు) క్వింటాల్‌కు మార్కెట్‌లో 6400 రూపాయలు ఉండగా, దీనిపై 2240 రూపాయలు సబ్సిడీగా ఇచ్చేందుకు నిర్ణయించారు. అంటే రైతులకు క్వింటాల్ వేరుసెనగ 4160 రూపాయలకే లభిస్తుంది. ఈ నిర్ణయం 2018-19 యాసంగి (రబీ) పంటకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.