తెలంగాణ

పరిపూర్ణానందపై ఆంక్షలు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: స్వామి పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. స్వామిపై ఆంక్షలు విధించడం అంటే హిందూ ధర్మాన్ని కించపరచడమేనని చెప్పారు. కాగా వేరొక ప్రకటనలో స్వామిపై విధించిన ఆంక్షలను తొలగించాలని హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఐక్యవేదిక నేతలు వేణుగోపాల్ మందాడ, కురుమ సంఘం నేత మండల మొగిళి, గంగపుత్ర సంఘం నాయకుడు పాక ఓం ప్రకాష్, మున్నూరుకాపు సంఘం నాయకుడు గందె కృష్ణ, కేయూ ప్రొఫెసర్ విజయబాబు, ప్రముఖ కవి రాజ్‌మోహదన్, వీహెచ్‌పీ నేతలు జయపాల్‌రెడ్డి, కట్టా రమేష్, ఆర్‌ఎస్‌ఎస్ నేత పెద్దిరెడ్డి మల్లారెడ్డి, డాక్టర్ సీహెచ్ సుధాకరరావు, మంద శ్రీనివాస్ స్వామిపై విధించిన ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు.