తెలంగాణ

వీసీల పనితీరు బాగుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరుపైనా, వైస్ ఛాన్సలర్ల పనితీరుపైనా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయని, ఏం చూసి గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారో రాజ్‌భవన్ వర్గాలు చెప్పాలని బీజేపీ శాసనసభాపక్ష నేత జీ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గవర్నర్ ఏ అంశాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. యూనివర్శిటీల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 70 శాతం పోస్టులు యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్నందుకు గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. యూనివర్శిటీల్లో మెస్‌లు ఎక్కడా ఓపెన్ కాలేదని, హాస్టళ్లలో పరిస్థితి చాలా అధ్వన్నంగా ఉందని, అలాంటి హాస్టళ్లను చూసి గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారా ఉప ముఖ్యమంత్రి చెప్పాలని అన్నారు. విశ్వవిద్యాలయాన్నింటినీ గవర్నర్ స్వయంగా పర్యటించాలని, అపుడు చూసి యూనివర్శిటీల్లో ఏం జరుగుతుందో చెప్పాలని అన్నారు. తెలంగాణ వచ్చాక యూనివర్శిటీల్లో పరిస్థితి ఘోరంగా మారిందని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్శిటీలో కనీసం ఒక్క ప్రొఫెసర్ కూడా లేని డిపార్టుమెంట్‌లు ఎన్నో ఉన్నాయని, యూనివర్శిటీల్లో పరిస్థితి గత నాలుగేళ్లుగా ఏమీ మారలేదని, సరిపడా నిధులు కేటాయించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. వీసీల పనితీరు ఏం చూసి గవర్నర్ మెచ్చుకున్నారో అది కూడా ఉప ముఖ్యమంత్రి చెబితే బావుండేదని కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా బదులివ్వాలని కిషన్ రెడ్డి అన్నారు.