తెలంగాణ

ఎన్‌ఐఏ దర్యాప్తులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: ఉగ్రవాదుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పాతబస్తీకి చెందిన యువకుల నుంచి ముఖ్యమైన సమాచారంతో పాటు విలువైన పత్రాలను ఎన్‌ఐఏ చేజిక్కించుకుంది. దీంతో ఉగ్రవాదుల సమాచారం కోసం మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తోంది. గత సోమవారం హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ అనుమానితులుగా పట్టుకున్న హన్నన్ ఖురేషే,ఖాదిర్, ఖుర్దూస్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ పలు కోణాల్లో విచారణ చేపట్టింది. ఎన్‌ఐఏ చేపిట్టన సోదాలు, విచారణలో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఎన్‌ఐఏ తనిఖీల్లో మంగళవారం ఉగ్రవాదులుగా ముద్రపడిన అసాదుల్లా, మునీర్‌షేక్‌లను అరెస్టు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిండంతో జాతీయ దర్యాప్తు సంస్థ వేగవంతంగా రంగంలోకి దిగింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వలు కూడా ఉగ్రవాదుల కదలికలపై హైఅలట్ ప్రకటించాయి. అబుదాబి దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో పాతబస్తీకి చెందిన యువకులు తరచుగా సంప్రదించడం జరుగుతోందని నిఘా వర్గాల అనుమానాలకు బలం చేకూరాయి. గత నాలుగు రోజులుగా పాతబస్తీ యువకులపై ఏన్‌ఐఏ వివిధ అంశాలపై ప్రశ్నించాయి. వారు చెప్పిన సమాధానాల్లో కొన్ని నిజాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ ఒక అవగాహనకు వచ్చిందని తెల్సింది. పుట్టుబడిన యువకుల్లో కొంతమందని విచారణకు మళ్ళీ రావాలని ఎన్‌ఐఏ అధికారులు సూచించారు.