తెలంగాణ

యూజీసీ రద్దు అనర్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: కేంద్రప్రభుత్వం యూజీసీని రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య దేశవ్యాప్త నిరసనల కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో హెచ్‌ఈసిఐ ముసాయిదా బిల్లు ప్రతులను ఏఐఎస్‌ఎఫ్ నేతలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వలీ ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ విద్యా రంగంలో స్వయంప్రతిపత్తి ఉన్న యూజీసీని రద్దు చేయాలనే ఆలోచనలోనే మోదీ ఫాసిస్టు ధోరణి ప్రతిబింబిస్తోందని అన్నారు. ఉన్నత విద్యలో రాజకీయ ప్రవేశం జరిగితే స్వేచ్ఛాలోచనలు ధ్వంసం అవుతాయని అన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ ఎస్ శంకర్ మాట్లాడుతూ హెచ్‌ఈసీఐ అమలులోకి వస్తే ఉన్నత విద్య సమాజ శ్రేయస్సుకు కాకుండా వ్యాపారవేత్తలకు వంత పాడుతుందని విమర్శించారు.
హెచ్‌ఈసీఐ పేరిట ఉన్నత విద్యలో కాషాయికరణ , కార్పొరేటీకరణను అమలుచేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనలో క్యాంపస్‌లు పోలీసు క్యాంపులుగా మారిపోయాయని అన్నారు. విశ్వవిద్యాలయాల స్వేచ్ఛకు నిలయాలుగా ఉండాలని, కానీ అణచివేత ధోరణి పెరగడంతో నియంతల పాలనను తలపిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రెహ్మాన్, లింగస్వామి, నరేష్, హరికృష్ణ, ప్రేమ్, సత్య తదితరులు పాల్గొన్నారు.