తెలంగాణ

చీకటి ఒప్పందం బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్ధికి ఓట్లు వేయడం ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీల చీకటి ఒప్పందం బహిర్గతం అయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపువిభజన హామీలను అమలు చేయడం లేదని కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తూనే ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ అంటకాగుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. ఓ చేతిలో ఎంఐఎంను మరో చేతిలో బీజేపీని పెట్టుకొని రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసగిస్తున్నాడని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీకి మద్దతు ఎలా కొనసాగిస్తారో ఎంఐఎం ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్‌కు మోదీలకు అనుసంధానకర్తగా అదాని వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఛతిస్‌ఘడ్ విద్యుత్ కొనుగోల్లు అదానిలకు లబ్దిచేకూర్చేందుకేనని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా అధిక ధరలకు ఛతిస్‌ఘడ్ నుంచి కొనుగోల్లు జరుపుతున్నారన్నారు. దీనిపై గతంలో ఆరోపణలు వస్తే తాము నేరుగా అక్కడి ప్రభుత్వం నుంచి నేరుగా కొనుగోల్లు జరుపుతున్నామని చెప్పారని అన్నారు. ఛతిస్‌ఘడ్ విద్యుత్ సంస్థలకు అదాని గ్రూప్ బొగ్గు సరఫరా చేస్తుందని, పరోక్షంగా తెలంగాణకు చెందిన వేల కోట్లు అదాని గ్రూప్ అక్కడి నుంచి కేసీఆర్ కుటుంబానికి చేరుతున్నాయని ఆరోపించారు.