తెలంగాణ

పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 9: అంతగిరి రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది నీళ్ళు ఇచ్చే దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని ప్రతిమ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-10 రాజన్న సిరిసిల్ల జిల్లా-సిద్దిపేట జిల్లాలకు అనుసంధానంగా ఉన్న అంతగిరి రిజర్వాయర్ పనుల పురోగతిపై రాజన్న సిరిసిల్ల జల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరాంలతో అయిదు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ క్షేత్ర స్థాయి పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలను ఆరా తీశారు. టనె్నల్ విస్తరణ, లైనింగ్ పనులు ఈ ఏడాదిలోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను సమన్వయం చేసుకుని పనులు తొందరగా పూర్తి చేసేలా చొరవ చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతగిరి రిజర్వాయర్ పంప్ హౌస్, సర్‌జపూల్ పనుల జాపత్యంపై ఆగ్రహం వ్యవక్తం చేశారు. కాలువల ద్వారా ప్రతి పల్లె చెరువులు, కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన, కుడి, ఎడమ కాలువలకు ఇరువైపులా హరితహారంలో భాగంగా కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకుని మొక్కలు నాటాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ పనులు సర్జ్‌పూల్, లైనింగ్, గేట్లు పనపుల పురోగతిపై ఆరా తీస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా చర్య లు చేపట్టాలని సూచించారు. అదే విధంగా పునరావాలస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు, ఆర్ అండ్ ఆర్ కాలనీల వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌కు సూచించారు. అంతగిరి రిజర్వాయర్ పనులలో భాగంగా ఇరిగేషన్ అధికారి సమరసేనపని తీరును మంత్రి అభినందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్, ఈఈ రవీందర్‌రెడ్డి, ఏజెన్సీల ప్రతినిథులు పాల్గొన్నారు.

చిత్రం..అంతగిరి ప్రాజెక్టు పనులపై అయిదు గంటల పాటు జరిగిన
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు