తెలంగాణ

రాష్ట్రాన్ని కుదవపెట్టి ప్రాజెక్టు కడుతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 9: ఎస్సారెస్పీలోని నీరు ఆవిరైనా ఫర్వాలేదు..రైతులకు నీరు ఇవ్వమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రానున్న ఎన్నికల మహాసంగ్రామంలో కౌరవ, పాండవ యుద్ధమేనని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహాభారతంలోని కౌరవ నీతిని అవలంభిస్తోందని, టీఆర్‌ఎస్‌ను కౌరవులతో పోల్చుతూ రానున్న ఎన్నికల్లో కౌరవ, పాండవ యుద్ధమేనన్నారు. ఊళ్లు ఇమ్మని అడుగలేదు..రైతులు తమ పంట పొలాలకు నీళ్లిమ్మని అడిగితే టీఆర్‌ఎస్ కౌరవ నీతిని అవలంభిస్తోంది, మహాభారత సంగ్రామానికి దారి చూపిస్తోందన్నారు. మీ ’కంటి వెలుగు’తో చూస్తే కాంగ్రెస్ చేసింది కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చి కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. ఖరీఫ్ పంట కాలానికి శ్రీరాంసాగర్ సాగునీటి ప్రాజెక్టునే నమ్ముకున్న ఉత్తర తెలంగాణ రైతాంగం ఒక వైపు వర్షాలు లేక, మరోవైపు శ్రీరాంసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎక్కడ ఎండిపోతాయోనని ఆందోళనలు చేస్తుంటే చలనం లేకుండా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 16టీఎంసీల నీరు ఉన్నాయని, 6.5టీఎంసీల నీరు మిషన్ భగీరథకు, 5టీఎంసీల నీరు డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నా 4.5టీఎంసీల నీరు విడుదల చేయవచ్చని సాంకేతిక నిపుణులే వెల్లడిస్తున్నా ఆటంకాలు సృషించే విధాలు అవలంభిస్తుంద న్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు వృధాపోకుండా ఆనాటి సీఎం వైఎస్సార్ పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా..? సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతోనే తెలంగాణ అప్పుల ఊబిలో నెట్టివేయబడి కుదేలవుతుందన్నారు. తుమ్మడిహెట్టి 140 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అంగీకారం చేసుకున్నది వాస్తవం కాదా..అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం తప్పిదాల వల్ల గడ రెండేళ్లు కోల్పోయారని, ఈఏడాది దసరా, దీపావళి పొంతనలేని ప్రకటనలు నీళ్లు ఇస్తారనే క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందన్నారు. ఎగువ ప్రాంత గంగాధర, కొడిమ్యాల, వేములవాడ మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని నీటి తరలింపు సిస్టం గ్రౌండై ఉంది నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయించే బాధ్యత చీఫ్‌విప్ కొప్పుల తీసుకోవాలన్నారు. భేషజాలొద్దూ..అధికారం శాశ్వతం కాదు..విజ్ఞత ప్రదర్శించాలని, రైతుల పంటకు నీళ్లు ఇవ్వాలని ఆయన హితవు పలికారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి