తెలంగాణ

గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 9: వరంగల్ నగరంలోని సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా హంగూ అర్భాటాలు ఎంతో ప్రత్యేకం. మాటలో చెప్పేకంటే కళ్లతో చూస్తే అర్థం అవుతుంది. నాటి ఘన చరిత్రకు సాక్ష్యాలుగా, నిర్మాణ కార్మికులు, కళాకారుల అద్భుత పనితానానికి నిదర్శనంగా నిలిచింది. కలెక్టర్ బంగ్లాకు శంకుస్థాపన జరిగి ఆగస్టు 10వ తేదీతో 133 సంవత్సరాలు పూర్త్తవుతుంది. కుతుబ్‌షాహీల పాలన తర్వాత దక్కన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న అసఫ్ జాహీల పాలన ఒకటిన్నర శతాబ్ధానికి పైగా కొనసాగింది. అసఫ్‌జాహీల పాలన కాలంలో నాటి పూర్వ వైభవాన్ని చాటిచెప్పేలా, ఆశ్చర్యం కలిగించే పలు భవన సముదాయాల నిర్మాణం జరిగింది. కుతబ్‌షాహీలు పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని సుభాలుగా విభజించారు. ఒక్కో సుభాకు తరఫ్ దార్ లేదా సుబేదార్ అధికారిగా ఉండేవారు. సుబేదార్‌ను లష్కర్ అనే పేరుతో కూడా పిలిచేవారు. తనీషా కాలంలో గోల్కొండ రాజ్యం ఆరు సుభాలుగా ఉండేది. వాటిలో వరంగల్ ఒకటి. వరంగల్ సుభాలో ఎలగందుల (కరీంనగర్), స్తంభగిరి (ఖమ్మం), దేవరకొండ (నల్గొండ), వరంగల్ అనే సర్కార్‌లో 16 పరగణాలు ఉండేవి. కుతుబ్‌షాహీల పాలనలోను, తదుపరి పాలించిన అసఫ్‌జాహిల కాలంలోను వరంగల్ సుభాగా వెలుగొందింది. 1853లో నిజాం నాసీ రొద్దొలా తన దివాన్‌గా సాలర్‌జంగ్‌ను నియమించారు. సాలార్‌జంగ్ నిజాం రాజ్యాన్ని ఐదు సుభాలుగా, 17జిల్లాలుగా, ప్రతి జిల్లాను కొన్ని తాలుకాలుగా విభజించారు. భవన నిర్మాణం ఒక్క అద్భుత నిర్మాణంలా ఉండడమే కాకుండా ప్రతి అంతస్తులోపల చెక్క మెట్ల నిర్మాణం ఉంటుంది. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మొదటి అంతస్తు నుంచి చూస్తే మొత్తం బంగ్లా ప్రాంతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి ప్రాంతమంతా అందమైన వివిధ రకాల అర్కిటెక్చర్ డిజైనింగ్‌తో ఎక్కడికక్కడ చూపరులను అబ్బుర పరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. గాలి, వెలుతురుకు ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా తలుపులను వరుసగా అమరుస్తూ వాటికి తగ్గట్టుగా గదుల నిర్మాణం చేపట్టారు. బయటకు భవనం ఎంతో అందంగా ఉంటుందో ణువునా ఆనాటి భవన నిర్మాణ కార్మికుల నేర్పరితనం, నిర్మాణ తీరులోనే కనిపిస్తాయి. భవన ప్రాంగణంలో ఒక ఆశ్వశాలతో పాటు ఇతర నిర్మాణాలు సైతం కనిపిస్తాయి. తాగునీటి అవసరాలకు ఒక దిగుడు బావిని తవ్వించారు. 13 ఎకరాల్లో భవనం, ఇతర కార్యాలయాల నిర్మాణం జరిగింది. బంగ్లా కమాన్ కింద రెండు వైపుల కాపలా సిబ్బందికోసం విశ్రాంతి గదుల నిర్మాణం చేసారు. బంగ్లా ఎదురుగా అందమైన నీటి ఫౌంటెన్ ఏర్పాటు చేసారు. భవన నిర్మాణ శైలి రాచఠీవితో సుపరులను ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. మొత్తం ప్రాంగణంలో పది గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిధులకు, కలెక్టర్ కార్యాలయ నిర్వాహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. దట్టమైన చెట్ల నీడలో ఆనాటి తీపి గుర్తుగా ఈ భవనం నిలుస్తుంది. భవన ప్రాంగణంలో పూలు, పండ్లు, శ్రీగంధం, నల్లతుమ్మ, రాగి, వేప, అల్లనేరేడు వంటి వందల రకాల సంప్రాదాయ మొక్కలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు సుబేదార్ నివాసంగా ఉపయోగించిన భవనాన్ని, స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 1950వ సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్ నివాసంగా ఉపయోగిస్తున్నారు. మొదటి కలెక్టర్ ఎంవి రాజ్వేద మొదలుకుని ప్రస్తుత కలెక్టర్ అమ్రపాలి వరకు 39మంది కలెక్టర్లు నివాసం ఉన్నారు. 1982లో కలెక్టర్ జవహర్ బావి పూడికి తీసిన సమయంలో నిజాం కాలంనాటి కత్తులు, ఇతర సామాగ్రి లభించడంతో రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించారు. సుబేదారిలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక ప్రవేశ ద్వారం కనిపిస్తుంది, దాని మీద భారీ సైజులో గడియారం ఉంటుంది. అత్యంత పటిష్టంగా, శత్రు దుర్భేగ్యంగా కోటలా నిర్మించారు. 1886లో బ్రిటిష్ అధికారి జార్జ్ పాల్మార్ భార్య ఈ బంగ్లా నిర్మాణంకోసం శంకుస్థాపన చేసారు. నిజాం పాలన జరిగిన ప్రాంతాల్లో ఉన్న ముఖ్య పట్టణాల్లో నిర్మించిన భవనాల్లో సుబేదార్ బంగ్లా అతి పెద్దది. విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను అందులో అతి పెద్ద ఫౌంటెయిన్ ఉన్నాయి. 22 అడుగుల ఎత్తున్న సీలింగ్‌ను వేలాడే భారీ శాండిలియర్స్ అందాలు తప్పక చూసి తీరాల్సిందే. కరెంట్‌లేని నాటి రోజుల్లో మసిపట్టని కొవ్వత్తులను లండన్‌నుంచి దిగుమతి చేసుకుని వాడారు. ఈ భవనాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఒక కట్టడానికి మరొక దానితో పోలిక ఉండదు. మొత్తం నిర్మాణాన్ని డంగు సున్నంతో చేపట్టారు.