తెలంగాణ

పనుల్లో జాప్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 10: రాష్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తాగునీరందించే మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వల్లే నిర్దేశిత గడవులోగా జిల్లాలో పనులు పూర్తిచేయలేక పోతున్నామని, సంబంధిత కాంట్రాక్టర్లు పనుల్లో వేగం పెంచి పంద్రాగస్టులోగా తాగునీరందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ కలెక్టర్ డి.దివ్యతో కలిసి స్మితసబర్వాల్ ఆదిలాబాద్ గ్రామీణ మండలం అడ్డగుట గూడెంలో మిషన్ భగీరథ పనులను ఆకస్మికంగా సందర్శించారు. పంపుసెట్ల నిర్మాణంలో జాప్యం, పైపుల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడ్డగుట్టలో ఇంజనీర్లతో కలిసి మిషన్ భగీరథ పనులపై మ్యాప్ ద్వారా సమీక్షించారు. గిరిజన గ్రామాలకు ఇప్పటికీ పైపులైన్ల నిర్మాణం పూర్తికాకపోవడంపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి పంద్రాగస్టులోగా తాగునీరందించేందుకు ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో పనుల ప్రక్రియ పూర్తికాకపోవడంపై స్మితాసబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకరావాలని, అంతేగాక పనుల్లో అవంతరాలు జరిగినా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. అడ్డగుట్ట గ్రామంలో ఈనెల 20లోగా పంపుసెట్ ఏర్పాటు పనులు పూర్తిచేసి, 30 తేదీలోగా ఏలాగైనా తాగునీరందించాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1175 ఆవాస గ్రామాలకు శుద్దజలం అందించేందుకు మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు. కలెక్టర్ దివ్య మాట్లాడుతూ పనుల్లో అక్కడక్కడా జాప్యం జరిగిందని, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనులు పూర్తిచేయాలని సూచించారు. 30లోగా పనులు పూర్తిచేసి అన్ని గ్రామాలకు తాగునీరందించాలని అధికారులకు సూచించారు.

చిత్రం..కలెక్టర్ దివ్యతో పనుల గురించి అడిగి తెలుసుకుంటున్న స్మితా సబర్వాల్