తెలంగాణ

వణికిస్తున్న డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 10: జిల్లాను డెంగ్యూ వ్యాధి పట్టి పీడిస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విష జ్వరాలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగాలతో కిటకిటలాడుతున్నాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో రోగుల్లో రక్త కణాల లోపం అధికమవుతోంది. వాతావరణ మార్పుల వల్లనే డెంగ్యూ విజృంభిస్తుందని, వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, మురికి కాలువలు, దోమలు, పందుల స్వైరవిహారం కూడా ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. తాగే నీరు కూడా కలుషితంగా ఉండటంతో పలువురు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులకు వస్తున్నారని డాక్టర్లు వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మంచాలు సరిపడా లేకపోవడంతో ఒకే దాన్ని ఇద్దరికి కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కుటుంబంలోని సభ్యులందరికీ డెంగ్యూ సోకిన సంఘ టనలున్నాయి. మురికి కాలువలను శుభ్రం చేయకపోగా, తీసిన మురికిని తరలించడం లేదని కాలనీవాసులు సంగారెడ్డిలో సరఫరా అవుతున్న మంజీర నీరు సైతం దుర్వాసన వెదల్లుతుందని, మట్టితో కూడిన నీరు వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లలేని వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే వేలాది రూపాయలను ముక్కుపిండి లాగుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన రోగిని ఇన్‌పేషంట్లుగా చేరేలా భయపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

చిత్రం..సంగారెడ్డి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి మహిళల వార్డులో ఒకే మంచంపై ఇద్దరికి చికిత్స అందిస్తున్న దృశ్యం