తెలంగాణ

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి బయటపడకుండా మంత్రి హరీష్‌రావు నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ట్రస్ట్భ్‌వన్‌లో ‘నీటి పారుదల ప్రాజెక్టులు-రీడిజైన్-అంచనాల పెంపు’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల్లో ప్రభుత్వ లోటుపాట్లు, అవినీతి తదితర అంశలపై విస్తృతంగా చర్చించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు 30వేల కోట్లతో చేపట్టి 9వేల కోట్లు ఖర్చు చేసి అనంతరం వాటిని కాదని తిరిగి కాళేశ్వరం వద్ద చేపట్టడం వల్ల వేలాది కోట్ల ప్రజా ధనం వృదా అయిందని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదంటూ 152 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్టును 148కి పరిమితం చేశారని దుయ్యబట్టారు.
జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా వదులుకున్నారని అన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని అదే సమయంలో అవినీతిని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పాలన, ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు.