తెలంగాణ

ఆర్టీసీపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆర్థిక స్థితి మెరుగు పరిచేందుకు నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. ప్రజా రవాణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆర్టీసీ అభివృద్ధికి కావాల్సిన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా ప్రభుత్వం కోరిక మేరకు ఆస్కిలో సమావేశం అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిపుణుల కమిటీ ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణలో వస్తున్న మార్పులు, తదనుగుణంగా ఆర్టీసీలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ పెరిగిన వ్యయానికి అనుగుణంగా ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు బస్సుల్లో సౌకర్యాల మెరుగు పరచాల్సి ఉందన్నారు. నగరంలో టూ వీలర్, ఫోర్ వీలర్, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే రోడ్లుపై రద్దీ తగ్గడంతో పాటు వాహన కాలుష్యాన్ని నియంత్రించగలుగుతామన్నారు. ప్రయాణికులను తక్కువ ధరలకు గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ అన్నారు. రాజకీయ, సినీ, క్రీడాకారులు నెలలో ఒక్కరోజైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సందేశం ఇవ్వగలిగితే సాదారణ ప్రయాణికులు సైతం బస్సుల్లో ప్రయాణించేందుకు మక్కువ చూపుతారని అన్నారు. అన్ని వర్గాల వారు ఆదరిస్తే సంస్థ ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తోందని అన్నారు. నెలలో ఒక్కరోజు బస్‌డే పాటించేందుకు ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు. సంస్థ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించినప్పుడు సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చునని బీ ఎం టీ సీ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ అన్నారు. పరివర్తన వ్యూహాలను రూపకల్పన కోసం ఒక సమగ్ర నివేదిక, దేశంలోని ఒకే సంస్థ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు విస్తరించిన వివిధ రాయితీల పరిశీలన, ప్రస్తుత వనరులతో అంతర్గత సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవడం పాటు ప్రపంచవ్యాప్తంగా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యయాన్ని తగ్గించడానికి ప్రణాళికలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవీందర్, కొమురయ్య, శివకుమార్ తదితరులు హాజరయ్యారు.