తెలంగాణ

కంటి వెలుగుతో కొత్త చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 11: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15న చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శనివారం వరంగల్ నగరంలోని కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ గార్డెన్‌లో కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 15న ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుడతారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 60 లక్షల మందికి కంటి పరీక్షలు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డులో చోటు లభించే అవకాశం లేకపోలేదన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి, కార్పొరేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు జరగాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అన్ని పల్లెల్లో విజన్ టెస్ట్‌లు చేసి లోపాన్ని బట్టి వైద్యం అందిస్తారని అన్నారు. కంటి జబ్బులపైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిపైనా దృష్టి సారించిందని ప్రధాన మంత్రి మోదీ కొనియాడడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందులాల్ కోరారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 15 మండలాల్లోని 225 గ్రామాల్లో 16 టీమ్స్‌తో శిబిరాలు ఏర్పా టు చేశామన్నారు. మరో మూడు రిజర్వు టీంలను కూడా ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.